NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన 
    Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

    Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన 

    వ్రాసిన వారు Stalin
    Feb 10, 2024
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాకిచ్చారు. రానున్న 15రోజుల్లో పంజాబ్‌లోని మొత్తం 13లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

    ప్రస్తుతం కేజ్రీవాల్ పంజాబ్ పర్యటనలో ఉన్నారు. శనివారం పంజాబ్‌లోని ఖన్నాలో ఆయన మాట్లాడుతూ. మొత్తం 14లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

    రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించారని కేజ్రీవాల్ గుర్తు చేశారు.

    పంజాబ్‌లోని 117సీట్లకు గాను 92సీట్లతో తమ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రజలను మరొక వరం కోరడానికి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.

    రెండు నెలల తర్వాత జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 14స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

    పంజాబ్

    దిల్లీలో కలిసి పోటీ చేసేందుకు కొనసాగుతున్న చర్చలు

    ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు భారత కూటమిలో భాగమే అయినప్పటికీ పంజాబ్‌లో మాత్రం పొత్తు ఉండదని దిల్లీ సీఎం ప్రకటన ద్వారా స్పష్టమవుతుంది.

    పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీచేస్తామని, అయితే దిల్లీలో మాత్రం పొత్తు కోసం ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆప్ పంజాబ్ ఇన్‌ఛార్జ్, ఎంపీ సందీప్ పాఠక్ తెలిపారు.

    ఇదిలా ఉంటే, రాష్ట్రాల వారీగా ఇండియా కూటమికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటైన ప్రతిపక్ష పార్టీల ఈ కూటమి విచ్ఛిన్నమైంది.

    పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, బిహార్‌లో నితీష్ కుమార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇప్పటికే 16 సీట్లను ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    పంజాబ్
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    అరవింద్ కేజ్రీవాల్

    Delhi Services Bill: నేడు లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా  దిల్లీ ఆర్డినెన్స్
    దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు  చంద్రబాబు నాయుడు
    నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్‌ దిల్లీ సర్వీసెస్ బిల్లు
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్ దిల్లీ సర్వీసెస్ బిల్లు

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  దిల్లీ
    మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట; అనారోగ్యంతో ఉన్న భార్యను కలవడానికి కోర్టు అనుమతి  మనీష్ సిసోడియా
    కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 'ఆప్' మహా ధర్నా; భారీగా బలగాల మోహరింపు  దిల్లీ
    అలా చేస్తే రాజస్థాన్‌‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్ లోక్‌సభ

    పంజాబ్

    పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్ పాకిస్థాన్
    'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం భగవంత్ మాన్
    కూల్ డ్రింక్ వలలో చిక్కిన ఘరానా దంపతులు.. మోసగత్తె డాకు హసీనా అరెస్ట్ భారతదేశం
    అంద‌రికీ ఫ్రీగా గుర్బానీ ప్రసారం.. పంజాబ్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం భగవంత్ మాన్

    తాజా వార్తలు

    World cancer day: ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్ చేస్తే గర్భాశయ క్యాన్సర్? క్యాన్సర్
    UP ATS: భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ ఏజెంట్.. మీరట్‌లో అరెస్టు  ఉత్తర్‌ప్రదేశ్
    Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    CAIT: పేమెంట్ల కోసం పేటీఎంను వాడకండి.. ఇతర యూపీఐలను వినియోగించండి: సీఏఐటీ పేటియం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025