Page Loader
Arvind Kejriwal: ఇవాళ మధ్యాహ్నం లొంగిపోనున్నఅరవింద్ కేజ్రీవాల్ 
Arvind Kejriwal: ఇవాళ మధ్యాహ్నం లొంగిపోనున్నఅరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: ఇవాళ మధ్యాహ్నం లొంగిపోనున్నఅరవింద్ కేజ్రీవాల్ 

వ్రాసిన వారు Stalin
Jun 02, 2024
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలుకు తిరిగి వెళ్లన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత లొంగిపోవాలని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఊరట లభించలేదు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో శనివారం విచారణ జరగగా.. బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది.

Details 

వైద్య పరీక్షల తాలూకు రికార్డులు కోర్టుకు

ఆయన వాస్తవాలను తొక్కిపట్టి, తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన జైలులో జరిపిన వైద్య పరీక్షల తాలూకు రికార్డులను కోర్టుకు సమర్పించారు. ఈ వివరాలను చూసిన మీదట బెయిల్ కు అనర్హులని బెంచ్ నిర్ధారించింది. సుప్రీం ఆదేశాల మేరకు కేజ్రీవాల్ ఈరోజు జైలు అధికారుల ముందు ఈ మధ్యాహ్నం లొంగిపోనున్నారు. మద్యం కుంభకోణం అంశంలో మనీలాండరింగ్‌ కేసుపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..