LOADING...
Longest Serving CMs: దేశంలో అత్యధికకాలం  సీఎంగా పనిచేసిన టాప్‌ 10 నాయకులు వీళ్లే..
దేశంలో అత్యధికకాలం సీఎంగా పనిచేసిన టాప్‌ 10 నాయకులు వీళ్లే..

Longest Serving CMs: దేశంలో అత్యధికకాలం  సీఎంగా పనిచేసిన టాప్‌ 10 నాయకులు వీళ్లే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీయే అద్భుత విజయంతో ముందంజ వేసింది. ఈ ఫలితాల తర్వాత జనతాదళ్‌ (యునైటెడ్‌) అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ (Nitish Kumar) మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే, ఆయన పదోసారి సీఎం కుర్చీలో కూర్చొననున్నారన్న మాట. ఈ సందర్భంలో.. దేశంలో అనేక సార్లు,ఎక్కువకాలం ఒకే రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన టాప్‌ 10 నాయకులు ఎవరు? ఎంతకాలం పాలించారు? ఒకసారి చూద్దాం.

వివరాలు 

పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ - సిక్కిం 

సిక్కిం రాష్ట్రాన్ని దాదాపు 25 సంవత్సరాలు నడిపిన పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ దేశంలో అత్యధికకాలం సీఎంగా ఉన్న రికార్డు నిలబెట్టుకున్నారు. 1994 డిసెంబరు 12 నుంచి 2019 మే 26 వరకు నిరంతరం అధికారంలో కొనసాగారు. ఆయన నేతృత్వంలో సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ వరుసగా ఐదుసార్లు గెలిచి అద్భుత విజయాలు సాధించింది. నవీన్‌ పట్నాయక్‌ - ఒడిశా ఒడిశా రాజకీయాలకు అజరామరం చేసిన పేరు నవీన్‌ పట్నాయక్‌. 2000మార్చి 5 నుంచి 2024జూన్‌ 12 వరకు సుమారు 24ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రికార్డు పరంగా చామ్లింగ్‌ తర్వాతి స్థానంలో నిలిచారు.2024లో ఎన్నికల్లో బిజూ జనతా దళ్‌ పరాజయంతో ఆయన యుగానికి బ్రేక్‌ పడింది కానీ,ఒడిశా రాజకీయాల్లో ఆయన ముద్ర మాత్రం చెరగదు.

వివరాలు 

జ్యోతి బసు - పశ్చిమ బెంగాల్‌ 

పశ్చిమ బెంగాల్‌కు వరుస ప్రభుత్వాల ప్రతీకగా నిలిచిన జ్యోతి బసు, 1977 జూన్‌ 21 నుంచి 2000 నవంబర్‌ 5 వరకు మొత్తం 23ఏళ్లు సీఎంగా పనిచేశారు. దేశంలో అత్యంత రాజకీయ తెలివితేటలు కలిగిన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. సీఎంగా ఉన్న సమయంలోనే ఆయనకు ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశం వచ్చినా, ఆయన వినయంగా తిరస్కరించారు. గెగాంగ్‌ అపాంగ్‌ -అరుణాచల్‌ ప్రదేశ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో గెగాంగ్‌ అపాంగ్‌ ప్రత్యేక గుర్తింపు పొందారు. రెండు వేర్వేరు దశల్లో కలిపి దాదాపు 22 ఏళ్లు సీఎంగా కొనసాగారు.మొదటి పాలన: 1980 జనవరి 18 నుంచి 1999 జనవరి 19 వరకు రెండోసారి: 2003 ఆగస్టు 3 నుంచి 2007 ఏప్రిల్‌ 9 వరకు

వివరాలు 

లాల్‌ థన్హావ్లా - మిజోరం 

మిజోరం రాష్ట్రంలో మూడు వేర్వేరు కాలాల్లో లాల్‌ థన్హావ్లా సుమారు 22 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పాలనలో రోడ్ల నిర్మాణం, ఆరోగ్య సేవలు, విద్యారంగ అభివృద్ధి ప్రత్యేకంగా మెరుగుపడ్డాయని చెప్పబడుతుంది. వీరభద్ర సింగ్‌ - హిమాచల్‌ ప్రదేశ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి చిరస్మరణీయ నేత వీరభద్ర సింగ్‌. నాలుగు వేర్వేరు పర్యాయాల్లో మొత్తం 21 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా సేవలందించారు. మాణిక్‌ సర్కార్ - త్రిపుర త్రిపురను అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన నాయకుడిగా మాణిక్‌ సర్కార్‌ ప్రసిద్ధి చెందారు. 1998 మార్చి 11 నుంచి 2018 మార్చి 9 వరకు వరుసగా నాలుగు టర్మ్‌లు సీఎంగా ఉన్న ఆయన మొత్తం పాలన 19 ఏళ్లకు చేరింది.

వివరాలు 

నీతీశ్‌ కుమార్‌ - బిహార్‌ 

బిహార్‌లో సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన నీతీశ్‌ కుమార్‌ ఇప్పటి వరకు కలిపి దాదాపు 19ఏళ్లు సీఎంగా పనిచేశారు. 2000లో కేవలం ఏడు రోజులు మాత్రమే మొదటిసారి పదవిలో ఉన్నప్పటికీ, తర్వాత నిలకడగా అధికారంలో కొనసాగుతూ ఇప్పుడైనా పదోసారి ప్రమాణ స్వీకారం చేసే దిశగా ఉన్నారు. కరుణానిధి - తమిళనాడు తమిళనాడు రాజకీయాల్లో అపార ప్రభావం చూపిన కరుణానిధి, పలు దఫాల్లో మొత్తం 18ఏళ్లు సీఎంగా రాష్ట్రాన్ని నడిపించారు. ద్రవిడ ఉద్యమానికి ఆయన చేసిన సేవలు దక్షిణాది రాజకీయాల్లో చెరగని ముద్రను మిగిల్చాయి. ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ - పంజాబ్‌ పంజాబ్‌ను సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ నాలుగు వేర్వేరు దశల్లో కలిపి దాదాపు 18ఏళ్లు సీఎంగా పనిచేశారు.