Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
అత్యాచార కేసులో ఆశారాం బాపునకు గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఆశారాం బాపును కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ఖరారు చేసింది. 10 సంవత్సరాల క్రితం అహ్మదాబాద్‌లోని మోటేరాలోని అతని ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం, అతని కుమారుడు నారాయణ్ సాయి తమపై పలుమార్లు అత్యాచారం చేశారని సూరత్‌కు చెందిన ఒక మహిళ ఆమె సోదరి ఆరోపించారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2013 ఇద్దరు అరెస్టు అయ్యారు. ఈ కేసులో నారాయణ్ సాయికి 2019లో జీవిత ఖైదు పడింది. మంగళవారం తండ్రికి కూడా జీవిత ఖైదు విధించింది కోర్టు.
కేసు దర్యాప్తు అధికారి దివ్య రవియాకు పలుమార్లు బెదిరింపులు
2013 నుంచి ఈ కేసు సుదీర్ఘ విచారణ సాగింది. ఈ కేసు విచారణ కోసం 68మంది నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారి దివ్య రవియాకు పలుమార్లు హత్య బెదిరింపులు రావడం గమనార్హం. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులు కాగా, వారిలో ఒకరు అప్రూవర్‌గా మారారు. మిగిలిన ఏడుగురిలో ఆశారాంను తప్ప మిగతా వారందరినీ కోర్టు దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా బాపు తప్ప మిగతా వారందరికి శిక్ష పడంది. ఇందులో ఆశారాం భార్య, కూతురు కూడా ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఆశారాంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంతో అతనిని దోషిగా ప్రకటించింది. 2018 నుంచి ఆశారాం జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.