Bhojasala-Madhya Pradesh-Indore: భోజశాల కాంప్లెక్స్ పై సర్వేను పూర్తి చేసిన భారత పురావస్తు శాఖ..మరో 8వారాల గడువు కోరిన ఏఎస్ ఐ
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ధార్(Dhar)జిల్లాలో ఉన్న భోజశాల కాంప్లెక్స్ లో భారత పురావస్తు శాఖ (ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) (ASI) మార్చి 22న ప్రారంభించిన సర్వే మంగళవారంతో ముగిసింది. వాస్తవానికి భారత పురావస్తు శాఖ ఈనెల 29కి తన సర్వే(Survey)ను ఇండోర్ హైకోర్టు(Indore High Court)కు నివేదించాల్సి ఉంది. అయితే సర్వే కోసం మరో ఎనిమిది వారాల గడువు కోరుతూ దరఖాస్తును సమర్పించింది. 21 మంది సభ్యులతో కూడిన భారత పురావస్తు శాఖకు చెందిన బృందంతో పాటు 32 మంది కూలీలు భోజశాలకు చేరుకున్నారు. ఈ బృందంతో పాటుగా హిందూ వర్గం నుంచి గోపాల్ శర్మ, ఆశిష్ గోయెల్, ముస్లిం వర్గం నుంచి అబ్దుల్ సమద్ ఖాన్ కూడా అక్కడకు వచ్చారు.
2003లో కుదిరిన ఒప్పందం
భోజశాలలో హిందువులు మంగళవారం ఉదయంనుంచి సాయంత్రం వరకూ పూజలు చేసుకోవచ్చని, ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవచ్చని 2003 లో ఒప్పందం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఏఎస్ ఐ మార్చి 22న భోజశాల కాంప్లెక్స్ లో తన సర్వేను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భోజశాల కాంప్లెక్స్ వాగ్దేవీ (సరస్వతి దేవి) కొలువైనట్లు హిందువులు, కమల్ మౌలా మసీదు స్థలంగా ముస్లింలు భావిస్తున్నారు. భోజశాల టెంపుల్ కమ్ కమల్ మౌలా మసీదు సముదాయాన్ని 6 వారాల్లోగా సర్వే చేయాలని ఏఎస్ ఐ ను మధ్యప్రదేశ్ హైకోర్టు మార్చి 11న ఆదేశించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.