Page Loader
Air Show: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025 
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025

Air Show: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షోగా గుర్తింపు పొందిన 'ఏరో ఇండియా' 15వ ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరు సమీపంలోని యలహంక ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో జరగనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది ఏరో ఇండియాలో ప్రపంచంలోని అత్యాధునిక ఐదో తరం యుద్ధ విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రష్యా రూపొందించిన ఎస్‌యూ-57, అలాగే అమెరికాకు చెందిన ఎఫ్‌-35 లైట్నింగ్‌ 2 విమానాలు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

Details

30దేశాల రక్షణ మంత్రులు హాజరయ్యే అవకాశం

మొత్తం 42,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా 900 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. 'ది రన్‌వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. అలాగే 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధులు హాజరుకానుండగా 43 దేశాల నుంచి వైమానిక దళాధిపతులు, కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏరో ఇండియా 2025 కోసం కూడా ఇప్పటికే వ్యూహరచన జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.