LOADING...
Child Marriage: బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు.. 416 మంది అరెస్టు
బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు.. 416 మంది అరెస్టు

Child Marriage: బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు.. 416 మంది అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2024
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాం రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలపై కఠిన చర్యలను కొనసాగిస్తోంది. మూడో దశలో జరిపిన ప్రత్యేక డ్రైవ్‌లో 416మంది అరెస్టు, 335 కేసులను నమోదు చేసినట్లు రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. డిసెంబర్ 21 రాత్రి నుంచి 22 వరకు పోలీస్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. బాల్య వివాహాలపై అస్సాం చేస్తున్న పోరాటంలో ఈ చర్య భాగంగా, ఇటీవల 416మందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సామాజిక రుగ్మతలపై సానుకూలంగా కఠిన చర్యలు తీసుకుంటూ, మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఈ చర్యలు కొనసాగిస్తామని 'ఎక్స్'లో సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు.

Details

స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్న అస్సాం ప్రభుత్వం

2023లో అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై రెండు విడతలుగా ముఖ్యమైన డ్రైవ్‌లు నిర్వహించింది. ఫిబ్రవరి, అక్టోబర్ నెలల్లో జరిగిన ఈ డ్రైవ్‌లలో మొత్తం 4,515 కేసుల్లో 3,483 మందిని అరెస్టు చేశారు. తర్వాతి దశలో 710 కేసుల్లో 915 మందిని అరెస్టు చేశారు. తాజాగా మూడో దశలో మరో 416 మందిని అరెస్టు చేయడం గమనార్హం. ఈ చర్యలు, అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టడమే కాకుండా, మాతా శిశు మరణాలను తగ్గించే లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.