LOADING...
Assam: అస్సాం అసెంబ్లీలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ బిల్లు
అస్సాం అసెంబ్లీలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ బిల్లు

Assam: అస్సాం అసెంబ్లీలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ బిల్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాం ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్‌ (UCC) బిల్లును ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినట్లు ANI తెలిపింది. "యూనిఫామ్ సివిల్ కోడ్, అస్సాం బిల్-2026"పై మే 27న చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

సంప్రదాయ ఆచారాలకు మినహాయింపు

ఈ యూసీసీ బిల్లు ద్వారా వివాహాలు, లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్స్‌, భరణం, వారసత్వ హక్కులకు ఒకే విధమైన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ (హిల్స్‌, ప్లెయిన్స్‌) పరిధిలోకి ఈ చట్టం రాదు. అలాగే సంప్రదాయ మత ఆచారాలు, పద్ధతులు, కర్మకాండలకు కూడా మినహాయింపు ఇచ్చారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకారం.. ఈ యూసీసీ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించనుంది. వివాహ కనీస వయస్సు, బహుభార్యత్వ నిషేధం, కుమార్తెలకు ఆస్తిలో సమాన హక్కులు, లివ్‌-ఇన్‌ సంబంధాల నియంత్రణ వంటి అంశాలు ఇందులో ఉంటాయని తెలిపారు.

వివరాలు 

ఉత్తరాఖండ్ తర్వాత అస్సాం

ఈ బిల్లు ఆమోదం పొందితే ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ తర్వాత యూసీసీ చట్టాన్ని అమలు చేసే మూడో రాష్ట్రంగా అస్సాం నిలవనుంది. 2024లో ఉత్తరాఖండ్‌ దేశంలోనే తొలిసారిగా యూసీసీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకారం.. ఈ చట్టం మహిళలకు మరింత రక్షణ, సాధికారత కల్పించిందన్నారు. వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగలేదని కూడా ఆయన ఇటీవల స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

గుజరాత్‌లో కూడా యూసీసీ బిల్లు

ఇదిలా ఉండగా, గుజరాత్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది మార్చిలో యూసీసీ బిల్లును ఆమోదించింది. వివిధ వర్గాల మహిళలకు సమాన హక్కులు, చట్టపరమైన రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. వివాహం, విడాకులు, లివ్‌-ఇన్‌ సంబంధాలు, భరణం, వారసత్వ అంశాలు ఇందులో ఉన్నాయి.

Advertisement

వివరాలు 

దేశవ్యాప్తంగా యూసీసీ అమలే బీజేపీ లక్ష్యం

దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలన్నది బీజేపీ ప్రధాన అజెండాలో భాగంగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 126 స్థానాల్లో 82 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్‌ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌తో కలిసి ఎన్డీఏ బలం 102 సీట్లకు చేరింది. ఈ నేపథ్యంలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement