LOADING...
Bihar Polls: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. 71 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. 71 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ

Bihar Polls: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. 71 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2025
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 71 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తారాపుర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. మంత్రులలో నితిన్ నబీన్ బాంకీపుర్ నుంచి, రేణు దేవీ బేతియా నుంచి, మంగల్ పాండే సీవాన్ నుంచి పోటీ చేస్తున్నారని పార్టీ తెలిపారు.

Details

110 స్థానాల్లో బీజేపీ పోటీ

బీజేపీ మొత్తం 101 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇది ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు చేసిన తరువాత విడుదలైన తొలి జాబితా కావడం విశేషం. ఈ జాబితా ప్రకటించడమే కాకుండా, పార్టీ స్థానిక మద్దతు, అభ్యర్థుల సమన్వయం, వ్యూహాత్మక ప్రణాళికపై సైతం దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.