Assembly Elections: తమిళనాడు, బెంగాల్‌కు అసెంబ్లీ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126) రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి (30)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు ప్రాంతాల్లో కలిపి మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తోంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. పుదుచ్చేరితో పాటు ఈ నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్ నెలల్లో వేర్వేరు తేదీల్లో ముగియనున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ముందుగానే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
Details
ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పూర్తి చేశారు. అలాగే క్షేత్ర స్థాయి పరిస్థితులను సమీక్షించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఇటీవల ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు కలిసి ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నారు.
Details
నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో ఎన్నికల వివరాలు ఇలా ఉన్నాయి
మొత్తం ఓటర్ల సంఖ్య: 17.4 కోట్లు మొత్తం అసెంబ్లీ స్థానాలు: 824 పోలింగ్ స్టేషన్లు: 2.19 లక్షలు ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులు: 25 లక్షలు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తేదీ వివరాలు ఇవే
Election Commission of India announces dates for Assembly elections in 5 states/UTs.
— ANI (@ANI) March 15, 2026
1. Assam- Date of Polling- 9th April; Date of Counting 4th May
2. Tamil Nadu- Date of Polling- 23rd April; Date of Counting- 4th May
3. West Bengal- Date of Polling- 23rd April (1st phase),… pic.twitter.com/wiM3u6FhIc