
16-18 ఏళ్ల మధ్య ఏకాభిప్రాయ సెక్స్ నేరామా? కాదా? కేంద్రాన్ని సమాధానం కోరిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
16-18 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకుల మధ్య జరిగే ఏకాభ్రిప్రాయ సెక్స్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
18 ఏళ్లలోపు వయసున్న వారి మధ్య ఏకాభిప్రాయ సెక్స్‌ను నేరంగా పరిగణించే చట్టబద్ధమైన అత్యాచార చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రం నుంచి సమాధానం కోరింది.
సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది.
న్యాయవాది హర్ష విభోర్ సింఘాల్ తన వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిల్‌ను సీజేఐ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జాతీయ మహిళా కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
#BreakingNews | Supreme Court seeks Centre's reply on plea to decriminalize consensual sex at 16-18@anany_b shares more details @anjalipandey06 pic.twitter.com/84diM9IWtE
— News18 (@CNNnews18) August 19, 2023