Odisha: కటక్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు: 10 మంది రోగుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కటక్ నగరంలోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రామా కేర్ ఐసీయూలో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, అధికారులతో మాట్లాడారు. అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
Deeply saddened by the tragic fire accident at the Trauma Care ICU of SCB Medical College and Hospital in Cuttack, which has reportedly claimed several precious lives. My sincere condolences to the bereaved families and prayers for those affected. Such incidents raise serious… https://t.co/whD25HMy0C
— Sagar Charan Das (@sagarcharandas) March 16, 2026