Page Loader
Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
దిల్లీ ఎయిమ్స్‌లోని ఎండోస్కోపీ గదిలో అగ్ని ప్రమాదం

Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

వ్రాసిన వారు Stalin
Aug 07, 2023
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎయిమ్స్‌లోని ఎండోస్కోపీ గదిలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించిన అధికారులు, ఎనిమిది ట్యాంకర్లతో మంటలను ఆర్పుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఆస్పత్రిలో పేషంట్లను తరలించారు. అలాగే సమీప ప్రాంతంలోని ప్రజలందరినీ ఖాళీ చేయించారు. పాత ఓపీడీలోని రెండో అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డుకు ఎగువన ఉన్న ఎండోస్కోపీ గది నుంచి పొగలు కమ్ముకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2021లో కూడా ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. అయితే అప్పుడు ఎవరికీ గాయాలు కాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎయిమ్స్‌లో అగ్నిప్రమాద దృశ్యం