
Delhi Borewell Accident: ఆడుకుంటూ వెళ్లి.. బోరు బావిలో పడిన చిన్నారి
ఈ వార్తాకథనం ఏంటి
Delhi Borewell Accident: పశ్చిమ దిల్లీలోని కేశవ్‌పూర్ ప్రాంతంలో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని రక్షించే పనిలో నిమగ్నమైంది.
చిన్నారి పడిన బోర్‌వెల్ దిల్లీ జల్ బోర్డు ప్లాంట్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ బోరుబావి దాదాపు 40 అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, పలువురు నిపుణులు కూడా ఘటనాస్థలికి చేరుకుని చిన్నారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.
రాత్రి 2.45 గంటల సమయంలో చిన్నారి పడిపోయినట్లు తమకు ఫోన్ వచ్చినట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్-ఇన్‌ఛార్జ్ వీర్ ప్రతాప్ సింగ్ తెలిపారు. వెంటనే తమ బృందంతో సంఘటనా స్థలానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొనసాగుతున్న సహాయక చర్యలు
#WATCH | Delhi: Visuals from the site where a child fell into a 40-foot-deep borewell inside the Delhi Jal Board plant near Keshopur Mandi. pic.twitter.com/f1LUrEi3ti
— ANI (@ANI) March 10, 2024