Page Loader
గుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి 
గుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి

గుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Oct 22, 2023
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాల సందర్భంగా నృత్యం గర్బా ఆడుతూ 24గంటల్లో కనీసం 10 మంది మరణించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించాయి. అయితే అన్ని మరణాలు గుండెపోటు వల్లే వచ్చినట్లు చెబుతున్నారు. చనిపోయిన వారిలో యువకుల నుంచి మధ్య వయస్కుల వరకు ఉన్నారు. గుజరాత్‌లో నవరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా గర్బా ఆడటం ఆనవాయితీగా వస్తుంది. వడోదరలోని దభోయ్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా గుండెపోటుతో మరణించాడు. అక్టోబర్ 20న అహ్మదాబాద్‌లో గర్బా ఆడుతూ 24 ఏళ్ల యువకుడు, కపడ్వంజ్‌లో, 17 ఏళ్ల బాలుడు గర్బా ఆడుతూ కుప్పకూలి మృత్యువాత చెందారు.

గుజరాత్

గార్బా ఆడే ప్రాంతాల్లో అంబులెన్స్‌ల ఏర్పాటు

నవరాత్రుల సందర్భంగా ఆరో రోజుల్లో గుండెకు సంబంధించిన అత్యవసర అంబులెన్స్ సేవల కోసం 521 కాల్‌లు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో కూడిన కాల్స్ 609 కాల్‌లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గర్బా వేడుకలు జరిగే సమయంలో ఈ కాల్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గుండె, శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా, గర్బా కార్యక్రమం నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గార్బా ఆడే ప్రాంతానికి సమీపాల్లో ఆసుపత్రులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. వైద్య సేవలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. గర్బాలో పాల్గొనే వారి భద్రత కోసం నిర్వాహకులు వేదిక వద్ద వైద్యులు, అంబులెన్స్‌లను ఏర్పాట్లు చేస్తున్నారు.