Page Loader
ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు 
ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు

ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు 

వ్రాసిన వారు Stalin
Sep 15, 2023
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ సమయంలో రన్‌వే నుంచి జారిపడి కుప్పకూలింది. భారీ వర్షమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీంతో విమానంలో ఉన్న ఐదుగురు ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ప్రమాదం నేపథ్యంలో రన్‌వైను కొద్దిసేపు మూసివేశారు. ఈ క్రమంలో ఐదు విస్తారా ఎయిర్‌లైన్స్ విమానాలను దారి మళ్లించారు. క్షతగాత్రులకు గాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియదు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే రన్‌వేపై విమానం శిథిలాలను సిబ్బంది తొలగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రన్‌వైపై విమానం కూలిపోతున్న దృశ్యం