
Lemon: ఒక్క నిమ్మకాయ రూ.35,000.. ఎందుకో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులోని ఈరోడ్‌లోని ఓ గ్రామంలోని ఆలయంలో నిర్వహించిన వేలంలో నిమ్మకాయ రూ.35 వేలకు అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వాహక అధికారులు వెల్లడించారు.
ఈరోడ్ నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న శివగిరి గ్రామ సమీపంలోని పజపౌసియన్ ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివుడికి నిమ్మకాయలు, ఇతర వస్తువులతో సహా పండ్లు సమర్పిస్తారు. తర్వాత ఈ వస్తువులను వేలం వేస్తారు.
మహాశివుడికి నైవేధ్యంగా పెట్టిన ఆ వస్తువులకు ఎంతో మహిమ ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ వస్తువులను వేలం పాటలో దక్కించుకునేందుకు పోటీ పడతారు.
నిమ్మకాయ కోసం నిర్వహించిన వేలంలో 15 మంది భక్తులు పాల్గొన్నారని, ఈరోడ్‌కు చెందిన ఒక భక్తుడికి నిమ్మకాయను రూ.35 వేలకు విక్రయించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మహాశివరాత్రి వేలంలో నిమ్మకాయకు భారీ ధర
Lemon Sold For ₹ 35,000 At Auction In Tamil Nadu Temple https://t.co/04bp2crQCj pic.twitter.com/oRxv8KeMFz
— NDTV (@ndtv) March 10, 2024