Delhi CM Atishi: అతిషి నేతృత్వంలో దిల్లీలో రోడ్ల పరిశీలన.. దీపావళిలోగా గుంతల రహిత రోడ్లు!
దేశ రాజధానిలో రోడ్ల పరిస్థితులను పరిశీలించేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సోమవారం వీధుల్లోకి వెళ్లారు. దీపావళిలోగా దిల్లీలో గుంతలు లేని రోడ్లగా తీర్చిదిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు. నేటి నుంచి వారం రోజులపాటు ఢిల్లీలోని 1,400 కిలోమీటర్ల రోడ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించనున్నారు. గుంతలున్న రోడ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టడానికి దిల్లీ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీపావళి నాటికి గుంతలు లేని రోడ్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అతిషి ఎన్‌ఎస్‌ఐసీ ఓఖ్లా, మోడీ మిల్ ఫ్లైఓవర్, చిరాగ్ ఢిల్లీ, తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్, మధుర రోడ్, ఆశ్రమ్ చౌక్ వంటి ప్రదేశాలలో రోడ్లను పరిశీలించారు.
రోడ్లను మరమ్మతు చేయడాని సూచనలు
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) రోడ్లను మరమ్మతు చేయడానికి అవసరమైన సూచనలు ఇచ్చారు. రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని ప్రకటించిన అనంతరం, ఈ సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను దక్షిణ, ఆగ్నేయ ఢిల్లీ రోడ్ల బాధ్యత తీసుకున్నట్లు పేర్కొంది. సౌరభ్ భరద్వాజ్ తూర్పు ఢిల్లీ రోడ్లను పరిశీలించగా, గోపాల్ రాయ్ ఈశాన్య ఢిల్లీలోని రోడ్లను, ఇమ్రాన్ హుస్సేన్ సెంట్రల్ రోడ్లను పరిశీలిస్తారని తెలిపారు. కైలాష్ గెహ్లాట్ నైరుతి, ఔటర్ దిల్లీకి, ముఖేష్ సెహ్రావత్ వాయువ్య దిల్లీకి బాధ్యత వహిస్తారని ఆమె వెల్లడించారు.
గుంతలు లేని రహదారులను అందించేందుకు కృషి
ఢిల్లీ ప్రభుత్వ రోడ్ అసెస్‌మెంట్, రిపేర్ ప్లాన్ ప్రకారం, 1,400 కి.మీ పొడవున్న పీడబ్ల్యుడి రోడ్లను పరిశీలించిన తర్వాత, అవసరమైతే పూర్తిగా లేదా అంగీకరించిన పద్ధతిలో మరమ్మతులు చేపట్టనున్నారు. గత వారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రికి లేఖ అందజేశారు. ఈ లేఖలో, నగరంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని అభ్యర్థించారు. పవర్ డిస్కమ్‌లు, ఢిల్లీ జల్‌బోర్డు చేపట్టిన పనుల వల్ల రోడ్లను దెబ్బతిన్నాయని, ఆ తర్వాత మరమ్మతులు చేపట్టలేదని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీ ప్రజలకు గుంతలు లేని రహదారులను అందించేందుకు దిల్లీ ప్రభుత్వం కృషి చేస్తుంది.