Page Loader
కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య..
విద్యార్థినిపై దాడి.. కత్తితో పొడిచి హత్య

కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య..

వ్రాసిన వారు Stalin
Jan 03, 2023
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. బీటెక్ చదవుతున్న విద్యార్థిని(19)పై ఆమె స్నేహితుడే దాడికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. ఏకంగా 10 సార్లు ఆమెపై దాడి చేసి.. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థినిని స్మితగా.. ఆమె స్నేహితుడిని పవన్ కల్యాణ్‌గా గుర్తించారు. స్మిత, పవన్.. ఇద్దరు వేర్వేరు కాలేజీలో చదువుతున్నారు. స్మిత కాలేజీ వద్దకు వచ్చి.. ఆమెను రూమ్‌లోకి లాక్కేళ్లిన పవన్ ఆమెపై కత్తితో దాడి‌చేశాడు. అనంతరం అతను ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ‌క్రమంలో స్మిత అరుపులు విన్న తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో..వారు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే స్మిత అప్పటికే మృతి చెందింది.

హత్య

ప్రేమ వ్యవహారమే కారణమా?

స్మిత, పవన్.. కోలార్‌ జిల్లా ముల్‌బాగల్‌ తాలుకాలోని ఒకే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం. తన ప్రేమను స్మిత తిరస్కరించడం వల్లే.. పవన్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణమైనట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు. అయితే ఆస్పత్రికి తరలించే క్రమంలో పవన్ చాతిపై గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.