LOADING...
Hyderabad: 27 సార్లు పర్మినెంట్ వీసా ప్రయత్నాలు.. ఉగ్రవాది సాజిద్‌కు హైదరాబాద్‌తో ఉన్న లింక్ బట్టబయలు!
ఉగ్రవాది సాజిద్‌కు హైదరాబాద్‌తో ఉన్న లింక్ బట్టబయలు!

Hyderabad: 27 సార్లు పర్మినెంట్ వీసా ప్రయత్నాలు.. ఉగ్రవాది సాజిద్‌కు హైదరాబాద్‌తో ఉన్న లింక్ బట్టబయలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటనకు పాల్పడిన ఉగ్రవాది సాజిద్‌కు సంబంధించిన షాకింగ్ అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర స్థాయి అధికారులు సాజిద్ నేపథ్యంపై సమగ్ర విచారణ చేపట్టారు. ఆ విచారణలో అతడు ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసా కోసం మొత్తం 27సార్లు దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకు అతడికి ఆ వీసా లభించలేదు. చివరకు 27ప్రయత్నాల అనంతరం రెసిడెంట్ రిటర్న్ వీసా మాత్రమే పొందినట్టు అధికారులు నిర్ధారించారు. అలాగే, గత 27 ఏళ్లుగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అతడి రాకపోకలపై కూడా కేంద్ర, రాష్ట్ర అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో బయటపడిన వివరాల ప్రకారం,సాజిద్ 1998లో నాంపల్లి లోని అన్వర్ ఉల్ కాలేజీలో బీఏ పూర్తి చేశాడు.

వివరాలు 

2000 సంవత్సరంలో వెన్నసాతో వివాహం

అనంతరం అదే ఏడాది నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తేలింది. ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో, 2000 సంవత్సరంలో వెన్నసా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటికే వెన్నసాకు ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసా ఉండటంతో, 2001లో తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. ఆ తర్వాత 2008లో రెసిడెంట్ రిటర్న్ వీసాను పొందాడు. ఈ దంపతులకు 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలో నవీద్ అనే కుమారుడు జన్మించాడు. నవీద్‌కు ఆస్ట్రేలియా పర్మినెంట్ వీసా కూడా లభించింది. 2003లో సాజిద్ తన భార్యతో కలిసి హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అదే ఏడాది, ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నాడు.

వివరాలు 

వారసత్వంగా వచ్చిన ఆస్తి విక్రయం 

2004లో తన కుమారుడిని హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. అనంతరం 2006లో తండ్రి మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక 2018లో వారసత్వంగా తనకు వచ్చిన ఆస్తిని హైదరాబాద్ వచ్చి విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. ఆ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో ఆస్ట్రేలియాలో ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాది సాజిద్ 2012లో చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయించుకోలేదని అధికారుల విచారణలో స్పష్టమైంది.

Advertisement