Page Loader
Bhooma akhilapriya: మాజీ మంత్రి ఇంటి ముందు మర్డర్ అట్టెంప్ట్ 
Bhooma akhilapriya: మాజీ మంత్రి ఇంటి ముందు మర్డర్ అట్టెంప్ట్

Bhooma akhilapriya: మాజీ మంత్రి ఇంటి ముందు మర్డర్ అట్టెంప్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2024
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం నేత,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్‌ నిఖిల్‌ పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీ కొట్టి, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు కాపలా కాస్తుండగా..దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా..తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి. ప్రస్తుతం నిఖిల్ ని ని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిలో నిఖిల్‌ ఆయనపై చేయి చేసుకున్నాడు.భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీసీటీవీ లో రికార్డు అయ్యిన దృశ్యాలు