PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
'Ayodhya Dham' Railway Station: అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ నుంచి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆరు వందే భారత్ రైళ్లను కూడా ప్రధానమంత్రి పచ్చ జెండా ఊపారు. శనివారం ఉదయం 11 గంటలకు అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రధాని రోడ్‌షో నిర్వహించారు. దీంతో దారిపొడవునా.. మోదీకి ప్రజలు, అభిమానులు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ రాకతో అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. అలాగే నగరాన్ని సుందరంగా అలంకరించారు.