Page Loader
Ayodhya ram mandir: రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే 
Ayodhya ram mandir: రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే

Ayodhya ram mandir: రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే 

వ్రాసిన వారు Stalin
Jan 21, 2024
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు ఈ ప్రత్యేక వేడుకకు హాజరుకానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి స్వయంగా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. రామమందిరం ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేళ.. ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిద్దాం. ప్రధాని ఉదయం 10:20 గంటలకు కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10:45గంటలకు హెలికాప్టర్‌లో సాకేత్ కళాశాలకు చేరుకుని 10 నిమిషాల తర్వాత రామమందిరానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రాణ ప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కుబేర్ తిల శివాలయంలో మోదీ పూజలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మోదీ

ఏ సమయంలో శంకుస్థాపన జరుగుతుంటే..

రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను 84 సెకన్ల పాటు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:29 pm 8 సెకన్ల నుంచి 12:30 pm 32 సెకన్ల వరకు ఉంటుంది. అభిజీత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని మోదీ తన చేతుల మీదుగా ప్రతిష్ఠించనున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని డీడీ న్యూస్‌లో ప్రత్యేక్ష ప్రసారం చూడవచ్చు. ఇందుకోసం అయోధ్యలోని పలు ప్రాంతాల్లో డీడీ న్యూస్ 40 కెమెరాలను ఏర్పాటు చేసింది. అలాగే, సరయూ ఘాట్ సమీపంలోని రామ్ కీ పౌరి, కుబేర్ తిలా వద్ద జటాయువు విగ్రహం, అయోధ్యలోని ఇతర ప్రదేశాల వద్ద అత్యాధునిక 4k టెక్నాలజీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.