LOADING...
Ayodhya Deepotsavam: 2.6 మిలియన్ దీపాల ప్రదర్శనతో అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్‌లో స్థానం
అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్‌లో స్థానం

Ayodhya Deepotsavam: 2.6 మిలియన్ దీపాల ప్రదర్శనతో అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్‌లో స్థానం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్యలో జరిగిన వెలుగుల పండుగ ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. సరయూ నది ఒడ్డున దీపాల ప్రకాశం చెలరేగి, తొమ్మిదో దీపోత్సవం అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. ఈసారి మొత్తం 26.17 లక్షల దీపాలు వెలిగించడం ద్వారా అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కొత్త ఘనతను సాధించింది. అదేవిధంగా, ఒకేసారి 2,128 మంది భక్తులు హారతులు నిర్వహించడం మరో కొత్త రికార్డ్‌గా నిలిచింది. ఈ రెండు విజయాలను గిన్నిస్ సంస్థ అధికారికంగా గుర్తించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

రామ్ కీ పైడీ ఘాట్ వద్ద స్వయంగా హారతి కార్యక్రమం నిర్వహించిన సీఎం యోగి 

దీపోత్సవ వేడుకలతో సరయూ ఘాట్‌లు భక్తులతో నిండిపోయాయి. రంగురంగుల రామలీలా ప్రదర్శనలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. రామ్ కీ పైడీ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హారతులు సమర్పించి, రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలో కళాకారులు రథాన్ని లాగుతూ దీపోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం మొత్తం వెలుగులతో నిండిపోయి, నలుమూలలా పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

వివరాలు 

పెరుగుతున్న భక్తుల తాకిడి  

రామమందిరం ప్రారంభమైన తరువాత నుండి అయోధ్యకు భక్తుల ప్రవాహం విపరీతంగా పెరిగింది. అధికారులు తెలిపిన ప్రకారం, జనవరి నుండి జూన్ వరకు సుమారు 23.82 కోట్ల మంది భక్తులు శ్రీరాముడి దర్శనం పొందారు. వారిలో దాదాపు 50 వేల మంది విదేశీయులు కూడా ఉన్నారు. 2017లో మొదటిసారిగా దీపోత్సవం నిర్వహించినప్పుడు 1.78 కోట్ల మంది మాత్రమే పాల్గొన్నా, ఈ ఏడాది ఆ సంఖ్య పది రెట్లు పెరిగింది. దీంతో అయోధ్య ప్రపంచవ్యాప్తంగా ఒక విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్‌లో స్థానం