Page Loader
Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీ.. 20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి.. ట్రస్ట్ అభ్యర్థన
అయోధ్యలో భక్తుల రద్దీ.. 20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి.. ట్రస్ట్ అభ్యర్థన

Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీ.. 20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి.. ట్రస్ట్ అభ్యర్థన

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్యలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేయడానికి, రామ్ లల్లా దర్శనార్థం భక్తులు అక్కడికి వస్తున్నారు. 30 గంటల్లోనే 25 లక్షల మంది భక్తులు దర్శనమిచ్చారు.ఈ పరిస్థుతిలో, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక కీలక ప్రకటన చేసింది. భక్తులందరూ తమ అయోధ్య దర్శనాన్ని 20 రోజులు వాయిదా వేసుకోవాలని సూచన జారీ చేసింది. అయోధ్యలో భక్తుల రద్దీ అత్యంత పెరిగిందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ట్రస్ట్ ఒక ట్వీట్ చేసింది.

వివరాలు 

ఒక్కరోజులో 10 కోట్ల మంది కుంభమేళాకి..

మౌని అమావాస్య రోజున, మహాకుంభమేళాకు విపరీతమైన భక్తులు వస్తారు. అధికారులు అంచనా వేసిన ప్రకారం, ఆ ఒక్కరోజులో 10 కోట్ల మంది కుంభమేళాకి రాగలుగుతారు. వీరిలో 10 కోట్లు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయగలుగుతారు. పవిత్ర స్నానాలు చేసిన తర్వాత, అయోధ్య దర్శనానికి కూడా వస్తారు. సమీప ప్రాంతాల నుండి వచ్చే భక్తులు తమ దర్శనాన్ని 15 నుంచి 20 రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సులభంగా దర్శనం అందించాలన్న బాధ్యత ట్రస్ట్ పై ఉందన్నారు. ఈ మేరకు భక్తులను వినమ్రంగా అభ్యర్థిస్తున్నట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొంది.