LOADING...
Azimji Premji: ఉన్నత విద్యా అభ్యసించే బాలికలకు 'అజీమ్‌ జీ ప్రేమ్‌జీ' స్కాలర్‌షిప్‌లు
ఉన్నత విద్యా అభ్యసించే బాలికలకు 'అజీమ్‌ జీ ప్రేమ్‌జీ' స్కాలర్‌షిప్‌లు

Azimji Premji: ఉన్నత విద్యా అభ్యసించే బాలికలకు 'అజీమ్‌ జీ ప్రేమ్‌జీ' స్కాలర్‌షిప్‌లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉన్నత విద్యా అభ్యసించే బాలికలకు అజీమ్‌ జీ ప్రేమ్‌ ఫౌండేషన్‌ ప్రతేడాది రూ.30,000 ఉపకార వేతనం అందిస్తోంది. ఈ విషయాన్ని ఫౌండేషన్ తెలంగాణ ప్రాంత బాధ్యుడు ఎం. శ్రీనివాస్‌రావు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఫ్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మంగళవారం మీడియాతో తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో టెన్త్, ఇంటర్ చదివి గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరిన బాలికలకు ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుందని తెలిపారు. ఈ పథకం డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సుల్లో చదివే బాలికలకు వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్‌ కోర్సులో చేరినప్పటి నుండి కోర్స్ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.30,000 అందిస్తారని స్పష్టం చేశారు.

Details

ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉండాలి

అయితే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్, ఇంటర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉండాలి. 18 రాష్ట్రాల్లో మొత్తం 2.5 లక్షల మంది బాలికలకు ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్టు శ్రీనివాస్‌రావు తెలిపారు. బెంగళూరు, భోపాల్‌లో యూనివర్సిటీల ద్వారా ఈ స్కాలర్‌షిప్‌లు నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో రూ. 1.26 లక్షలు, కర్ణాటకలో 88,000, కానీ తెలంగాణలో కేవలం 3,275 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయని చెప్పారు. బాలికల్లో సరైన అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణమని తెలిపారు.

Details

దరఖాస్తు విధానం

అర్హులైన వారు 'అజీమ్‌ ప్రేమ్‌జీ వెబ్‌సైట్' ద్వారా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తుకు అవసరమైన దస్తావేజులు: తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం, బ్యాంక్ ఖాతా వివరాలు, టెన్త్, ఇంటర్ మార్కుల మెమో, ఆధార్ కార్డు, గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ ఫీజు రసీదు (బోనఫైడ్ లేదా ట్యూషన్ ఫీజు). దరఖాస్తుకు ఎలాంటి ఫీజు ఉండదు. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. రెండో విడత దరఖాస్తులు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 15,000 మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. అర్హులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం 99630 28900 నంబర్‌లో సంప్రదించాలని ఫౌండేషన్ సూచించింది.