Page Loader
B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం
B20 సదస్సులో నిర్మలా సీతారామన్

B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 25, 2023
06:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో గత 9 ఏళ్లుగా సుస్థిరమైన సంస్కరణలు చేపట్టామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో అస్థిరమైన సంస్కరణలు ఉండేవని, కొవిడ్ కాలంలోనూ సంస్కరణలను కొనసాగించామన్నారు. కఠిన పరిస్థితులను సవాలుగా తీసుకోలేదని, వాటినొక అవకాశంగా మల్చుకున్నట్లు చెప్పారు. అయితే ఆరోగ్యం, విద్య రంగాల్లో పెట్టుబడులను పెంచడం భారత్ ప్రాధాన్యతలని సీతారామన్ తెలిపారు. ద్రవ్యోల్బణ నియంత్రణతో ఆదాయాన్ని పెంచేందుకు స్థిర విధానాలను చేపడుతున్నామన్నారు. సీఐఐ అధ్వర్యంలో నిర్వహించిన B-20(గ్లోబల్ బిజినెస్ మీట్) సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి, భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు.దేశీయపెట్టుబడులు సైతం చాలా బలంగా ఉన్నాయన్నారు. FY 23-24లో Q1 GDP సమాచారం త్వరలోనే వస్తుందని చెప్పిన నిర్మలా, Q1 ఫలితాలు ఆశజనకంగానే ఉంటాయన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

B20 సదస్సులో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్