Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ సోమవారం ప్రజాశాంతి పార్టీలో చేరారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. బాబూ మోహన్‌కు కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బాబూ మోహన్ బీజేపీ తరఫున అందోల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆయన ఘోరంగా ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై బాబూ మోహన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఆయన బీజేపీని వీడారు. ప్రజాశాంతి పార్టీ నుంచి బాబూ మోహన్ లోక్‌సభకు పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు క్యాబినెట్‌లో బాబూ మోహన్ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.