
రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను
ఈ వార్తాకథనం ఏంటి
మే 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
అది బలపడి 7వ తేదీ నాటికి అల్పపీడనంగా మారొచ్చని చెప్పింది. తూర్పు తీర రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు.
ఇప్పటికే అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతులకు ఇది పిడుగులాంటి వార్తనే చెప్పాలి.
మే 9నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారవచ్చని ఐఎండీ అంచనా వేసింది.
ఒకవేళ తుపాను ఏర్పడితే దానికి 'మోచా' పేరును పెట్టనున్నట్లు వెల్లడించింది. అయితే తుపాను ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుందనే ఐఎండీ స్పష్టంగా చెప్పలేదు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుపాను
గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు
తుపాను సంభవిస్తే తీర ప్రాంత రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర చెప్పారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను అభివృద్ధి చెందుతుందని తాము అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.
తుపాను ప్రభావంతో మే 7 నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంపై గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల మత్స్యకారులు ఆగ్నేయ బంగాళాఖాతం వైపు వెళ్లవద్దని సూచించారు.
అలాగే అక్కడ ఉన్నవారు మే 7లోపు ఖాళీ చేయాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తూర్పు తీరంలో ఎలాంటి హెచ్చరికలు లేవని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండటానికి ఇస్తున్న సమాచారం ఇది అని చెప్పారు.