LOADING...
Balakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు 
Balakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు

Balakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు 

వ్రాసిన వారు Stalin
Feb 13, 2024
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించిన అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ(ACB) వేగం పెంచింది. ఈ కేసులో బాలకృష్ణ బినామీలైన భరత్, సత్యనారాయణ, భరణికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. బాలకృష్ణకు అక్రమాస్తుల కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, బాలకృష్ణ లావాదేవీలను నిలిపివేయాలని ఏసీబీ జిల్లా కలెక్టర్‌కు లేఖను కూడా రాసింది. బాలకృష్ణ ఇంట్లో లభించిన ఆధారాలను బట్టి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, బాలకృష్ణ చెప్పిన ఐఏఎస్ అధికారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బాలకృష్ణ లావాదేవీలను నిలిపివేయాలని ఏసీబీ లేఖ