తదుపరి వార్తా కథనం

Balapur Laddu: రికార్డు ధరలో వేలం.. బాలాపూర్ లడ్డూని 35 లక్షలకు ఎవరు కొనుగోలు చేశారంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 06, 2025
11:11 am
ఈ వార్తాకథనం ఏంటి
బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయిలో వేలం చేరింది. ఈ ఏడాది గణేశుడి లడ్డూ ఏకంగా రూ.35 లక్షలకు వేలం అయింది. ఈరోజు జరిగిన వేళలో లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ గణనాథుడి లడ్డూను దక్కించుకున్నారు. ప్రతేడాదిలా ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ కోసం వేగవంతమైన పోటీపోటీ జరిగింది. ఈ ఏడాది వేలంలో మొత్తం 38 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. చివరికి కర్మన్‌ఘాట్ నుంచి వచ్చిన లింగాల దశరథ్ గౌడ్ లడ్డూని పొందారు. లడ్డూ విజేతను ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా సన్మానించింది. గమనించదగిన విషయం ఏమిటంటే, గతేడాది పోలిస్తే ఈసారి లడ్డూ ధర రూ.4.99 లక్షలతో పెరిగింది.