LOADING...
Bandi Sanjay: గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ పాటతో సందడి
గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ పాటతో సందడి

Bandi Sanjay: గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ పాటతో సందడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (ఆరెస్సెస్) స్థాపనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కొత్త అవతారం ఎత్తారు. సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా ఆ సంస్థ గీతాలను ఆలపించారు. ఈ గీతాలకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా, అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. శ్రీరామనవమి సందర్భంగా నేడు (శుక్రవారం) ఈ పాటలను కరీంనగర్లో అధికారికంగా విడుదల చేయనున్నారు. బండి సంజయ్ ఆలపించిన ఈ గీతాలకు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు అందించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పాటపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయన గాత్రం బాగుందని, గాయకుడిగానూ ఆకట్టుకున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.

Advertisement