LOADING...
Ballari: బళ్లారిలో బ్యానర్ల వివాదం: ఘర్షణ,కాల్పులు.. ఒకరి మృతి 
బళ్లారిలో బ్యానర్ల వివాదం: ఘర్షణ,కాల్పులు.. ఒకరి మృతి

Ballari: బళ్లారిలో బ్యానర్ల వివాదం: ఘర్షణ,కాల్పులు.. ఒకరి మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్యానర్ల తొలగింపు అంశాన్ని కేంద్రంగా చేసుకుని బళ్లారి నగరంలో గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ అదుపు తప్పింది. పరిస్థితి తీవ్రమవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో రాజశేఖర్‌ అనే యువకుడు మృతి చెందడంతో ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఉద్రిక్తతకు లోనైంది. ఇరువర్గాల కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం, కాల్పులు జరగడం, చివరకు ఒకరి ప్రాణం పోవడం పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

వివరాలు 

రాళ్లు, బీరు సీసాలు విసురుకున్న రెండు వర్గాలు 

ఘర్షణలో కాంగ్రెస్‌ కార్యకర్తలు గాయపడ్డారన్న సమాచారం అందడంతో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి రాత్రి 9.30 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన రాకతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, బీరు సీసాలు విసురుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కూడా రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. బళ్లారిలో చోటుచేసుకున్న ఈ ఘటన నగరంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది.

వివరాలు 

ఇంటిపైకి గుండాలను పంపించారు

బళ్లారి: మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డికి నేర చరిత్ర ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. గత 25 ఏళ్లుగా రౌడీయిజం చేస్తున్న వారిని తట్టుకుని భాజపాను అధికారంలోకి తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. వారి చుట్టూ హత్యలకు పాల్పడిన గుండాలే ఉన్నారని విమర్శించారు. గురువారం రాత్రి తన నివాసం ముందు విలేకరులతో మాట్లాడిన గాలి, ఉదయం తమ ఇంటి ఆవరణలో బ్యానర్లు కట్టారని భద్రతా సిబ్బంది తమకు తెలియజేశారని చెప్పారు. ఆ తర్వాత బ్యానర్‌ పడిపోయిందని, దీనిపై క్షమాపణ చెప్పి మళ్లీ బ్యానర్‌ కడతామని తాము చెప్పామని వివరించారు.

Advertisement

వివరాలు 

ఇంటిపైకి గుండాలను పంపించారు

అయితే అనంతరం తమ ఇంటి ముందు రహదారిపై ఎమ్మెల్యే సన్నిహితుడు సతీష్‌రెడ్డి, చానాళ్‌ శేఖర్‌ కుర్చీలు వేసుకుని కూర్చున్నారని తెలిపారు. వారి వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఇంటిపై రాళ్లు విసిరారని గాలి ఆరోపించారు. తాను గంగావతి నుంచి వస్తున్న సమయంలో సతీష్‌రెడ్డి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.8 కోట్లతో వాల్మీకి భవనం నిర్మించామని, ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించామని గుర్తుచేశారు. అయినప్పటికీ మళ్లీ ఎందుకు వివాదాలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేకపోవడం, అభివృద్ధి చేయలేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని గాలి జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

Advertisement

వివరాలు 

వాల్మీకి అజ్జ చూసుకుంటారు 

బళ్లారి నగరంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తాము పూర్తిగా శాంతియుతంగా నిర్వహిస్తున్నామని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం జరగకుండా చూడాలనే ఉద్దేశంతోనే కొందరు ఘర్షణలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బ్యానర్‌ అంశాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వాల్మీకి అజ్జ వారి పాపాలను చూసుకుంటారని వ్యాఖ్యానించారు. వారికి వమస్సు 60 నుంచి 65 ఏళ్ల ఉండవచ్చు. తన వయస్సు 35 ఏళ్లేనని, యువత శాంతియుతంగా ముందుకు సాగుతుంటే ఇలాంటి ప్రవర్తన తగదని స్పష్టం చేశారు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయస్సు మీదపడినా వారే రెచ్చగొట్ట్టేలా చేయడం సరికాదన్నారు ఈ ఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement