Cyclone Warning: నవంబర్ 19 తర్వాత అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం.. వాతావరణ అధికారుల అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు ఆసియా ప్రాంతంలో వరుసగా రెండు భారీ తుపాన్లు ఏర్పడటంతో,బంగాళాఖాత సముద్ర వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా థాయిలాండ్ వరకూ చేరిన అల్మాగీ (Almaegi) తుపాను భారీ మేఘాలను తీసుకువచ్చి బంగాళాఖాతం మీదే నిలిపేసింది. ఇప్పటికే అక్కడ సముద్రపు నీరు వేడిగా ఉండటంతో, వాటితో కలిసి ఒక ద్రోణి వంటి వాతావరణ వ్యవస్థను ఏర్పరుస్తోంది. ఇది తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తాజా లెక్కల ప్రకారం,దక్షిణ బంగాళాఖాతంలో - శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవుల మధ్య కొత్త ఆవర్తనం వచ్చే అవకాశం ఉంది. అది 19వ తేదీకి అల్పపీడనంగా మారవచ్చు. ఆ తర్వాత అది తుపానుగా మారే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ఈ తుపాను ఏర్పడటానికి కారణాలు ఇలా ఉన్నాయి:
అందుకే రైతులు ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 20వ తేదీ తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అల్మాగీ తుపాను తెచ్చిన మేఘాలు బంగాళాఖాతంపై ఇప్పటికే చేరి స్థిరంగా ఉన్నాయి. వీటికి తోడు ఫంగ్-వాంగ్ (Fung-Wong) అనే మరొక బలమైన తుపాను ప్రభావం ఉంది. ఇది నిన్న ఫిలిప్పీన్స్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. గంటకు 215 కిమీ వేగంతో వీచిన ఈ తుపాను తీరం దాటి వెళ్లిన తర్వాత కూడా బలహీనపడలేదు. ఫిలిప్పీన్స్ ఉత్తర ప్రాంతాలు పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఫంగ్-వాంగ్ ఉత్తరం వైపుకి వెళ్లినా, దాని వల్ల ఏర్పడిన భారీ మేఘాలు తూర్పు ఆసియాలో విస్తరించి ఉన్నాయి. వచ్చే వారం రోజుల్లో అవి క్రమంగా బంగాళాఖాతంవైపు దిగొస్తాయి.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెరిగిన చలి
ఇక భూమధ్యరేఖ సమీప ప్రాంతాల్లో కూడా ఉక్కపోత పెరగడంతో, సముద్రం నుంచి ఆవిరి ఎక్కువగా ఎగసి మరింత మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొద్ది రోజులలో శ్రీలంక - అండమాన్ ప్రాంతం వైపు చేరతాయి. దీంతో బంగాళాఖాతం ఇంకా ఎక్కువ వేడి అవుతుంది. ప్రస్తుతం అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రంలో ఎలాంటి తుపాన్లు లేవు. అందువల్ల గాలులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. బంగాళాఖాతంలో వచ్చే సుడి వాటిని తనవైపు లాగుకోవడంతో, తుపాను త్వరగా బలపడే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చలి పెరిగింది. ఇది ఇంకా సుమారు 10 రోజులు ఉండొచ్చు. 20వ తేదీ తర్వాత మేఘాలు క్రమంగా కమ్ముకుంటాయి. ఇవి పూర్తిగా విస్తరితే వర్షాలు రావచ్చు.
వివరాలు
కోస్తా ఆంధ్రకు తుపాను సుమారు 1200 కిమీ దూరంలో..
అందువల్ల రైతులు తమ పంటలు, ధాన్యాలను పొలాల్లోనే ఉంచకుండా ముందే సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలి. ప్రస్తుతం వెంటనే భయపడాల్సిన పరిస్థితి లేదు. కానీ అప్రమత్తత మాత్రం అవసరం. కోస్తా ఆంధ్రకు తుపాను సుమారు 1200 కిమీ దూరంలో ఏర్పడవచ్చు. తిరుపతి నుండి ~1190 కిమీ, విశాఖపట్నం నుండి ~1270 కిమీ దూరంలో కావచ్చు. ఇది ఎటు దిశగా వెళ్తుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. అయితే, బలమైన తుపాను అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన మోం తుపాను ఇచ్చిన నష్టాన్ని మనం చూసాం. ఈసారి ముందుగానే సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రణాళికలు వేస్తున్నాయి.