Page Loader
ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం

ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం

వ్రాసిన వారు Stalin
Feb 14, 2023
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్, పీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. కమల దళం కూడా అదేస్థాయిలో తిప్పికొట్టింది. బీబీబీ కార్యాలయాల్లో ఐటీ సోదాలను 'అప్రకటిత ఎమర్జెన్సీ'గా కాంగ్రెస్ అభివర్ణించింది. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. మొదట బీబీసీ డాక్యుమెంటరీపై నిషేదం విధించి, ఇప్పుడు ఐటీ దాడులు చేస్తొందని మండిమడింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. బీబీసీ కార్యాలయాల్లో సర్వే వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రతిపక్షాలు తెలుసుకోవాలని అన్నారు. మీడియా సంస్థలో సోదాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదని అన్నారు.

బీబీసీ

బీబీసీ అంటే 'భ్రష్ఠ్ బక్వాస్ కార్పొరేషన్': బీజేపీ నేత గౌరవ్ భాటియా

తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ మహువా మోయిత్రా ఆదాయపు పన్ను శాఖ దాడులపై వ్యంగ్యంగా స్పందించారు. బీబీసీ దిల్లీ కార్యాలయంలో ఆదాయపు పన్ను దాడులు జరుగుతున్నట్లు తెలిసిందని, ఇది నిజమా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఐటీ దాడులను సామెతతో పోల్చారు. 'వినాశకారి విపరీత బుద్ధి' అంటూ చమత్కరించారు. ఐటీ దాడులను బీబీసీపై 'సైద్ధాంతిక అత్యవసర పరిస్థితి' సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదయ్ అభివర్ణించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ నేత గౌరవ్ భాటియా ధీటుగా సమాచారం చెప్పారు. బీబీసీ, కాంగ్రెస్ ఎజెండా ఒకేలా ఉన్నట్లు పేర్కొన్నారు. బీబీసీ అంటే 'భ్రష్ఠ్ బక్వాస్ కార్పొరేషన్' అని చెప్పుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ చేసిన ట్వీట్