LOADING...
Andrapradesh: రాష్ట్రంలో తొలిసారి బీసీ రక్షణ చట్టం అమలు: మంత్రి సవిత
రాష్ట్రంలో తొలిసారి బీసీ రక్షణ చట్టం అమలు: మంత్రి సవిత

Andrapradesh: రాష్ట్రంలో తొలిసారి బీసీ రక్షణ చట్టం అమలు: మంత్రి సవిత

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడలోని తాడిగడప బీసీ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై సవివరంగా చర్చ జరగింది. ఈ చట్టానికి సంబంధించి ఇప్పటికే ముసాయిదా సిద్ధం అయినట్లు మంత్రి సవిత తెలిపారు. చట్టం అమలులో కులం లేదా వృత్తి పేరుతో దూషించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఆమె హెచ్చరించారు. చట్ట డ్రాఫ్ట్‌పై బీసీ ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు కూడా పొందాలని నిర్ణయించగా, భేటీ వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Details

న్యాయనిపుణులతో చర్చించాం

మంచి న్యాయ పరిరక్షణ కల్పించేందుకు బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామని, దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని అమలు చేయబోతున్నామన్నారు. బీసీల మానప్రాణాలకు భరోసా కల్పిస్తూ, అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే విధంగా చట్టాన్ని రూపొందిస్తున్నామ‌ని మంత్రి స‌వితా చెప్పారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే కోర్టుల్లోనూ న్యాయనిపుణులతో చర్చించామ‌ని ఆమె వెల్ల‌డించారు.

Advertisement