Raksha Bandhan Tragedy: చనిపోయే ముందు సోదరుడికి రాఖీ కట్టిన యువతి
మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేధింపులు తాళలేక గడ్డిమందు తాగి కోన ఊపిరితో ఉన్న ఓ విద్యార్థిని తన సోదరుడికి రాఖీ కట్టి కన్నుమూసింది. రాఖీ పండగకు తాను లేకపోతే తన సోదరుడికి ఎవరు రాఖీ కడతారని భావించి, రాఖీ కట్టి తాను ప్రాణాలను విడిచింది. ఇక విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఆకతాయిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర చట్టాల కేసు నమోదు చేశామని నర్సింహులపేట పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితులు
మహబూబ్ నగర్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(17) కోదాడలో పాలటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ అకతాయి ప్రేమ పేరిట తరుచూ వేధిస్తుండటంతో ఆమె గత గురవారం గడ్డిముందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, శనివారం రాత్రి తమ్ముడికి రాఖీ కట్టింది. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆ విద్యార్థిని మృతి చెందింది. బాలికను వేధింపులకు గురిచేసిన నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.