Page Loader
Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్ 
Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్

Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్ 

వ్రాసిన వారు Stalin
Oct 07, 2023
06:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ శనివారం బీజేపీలో చేరారు. బర్కత్‌పురాలోని బీజేపీ యూనిట్ కార్యాలయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, బీజేపీ హైదరాబాద్‌ (సెంట్రల్‌) విభాగం అధ్యక్షుడు గౌతమ్‌రావు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. బీజేపీలోకి తన చేరికతో తాను సొంత ఇంట్లోకి వచ్చనట్లు అయ్యిందని చెప్పారు. తాను గతంలో బీజేపీ సభ్యుడిని కానప్పటికీ, చాలా కాలం పాటు పార్టీ కార్యకలాపాలతో సంబంధాలను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రవీణ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కండువా కప్పి ఆహ్వానించిన డీకే అరుణ