LOADING...
Bengaluru:  లగ్జరీ కారుతో స్టంట్లు.. డాన్‌ కుమారుడిపై కేసు

Bengaluru:  లగ్జరీ కారుతో స్టంట్లు.. డాన్‌ కుమారుడిపై కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో లగ్జరీ కారుతో రోడ్లపై ప్రమాదకరంగా స్టంట్లు చేసిన ఘటన కలకలం రేపింది. ఒకప్పటి అండర్‌వరల్డ్ డాన్‌ కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఓ యువకుడు లంబోర్గిని కారుతో నగర రోడ్లపై వేగంగా స్టంట్లు చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు వెంటనే స్పందించారు.

వివరాలు 

రికీ రాయ్‌పై కేసు నమోదు

వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఆ లగ్జరీ కారు బెంగళూరు డాన్ ముత్తప్ప రాయ్ కుమారుడు రికీ రాయ్ నివాసానికి చెందినదిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, రికీ రాయ్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఘటన సమయంలో కారును అతడే నడిపాడా లేదా అన్న విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఒక దశాబ్దం క్రితం బెంగళూరును వణికించిన అండర్‌వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కాన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే.

Advertisement