Page Loader
Bengaluru: బెంగళూరులో ప్రేయసిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు.. కారణం ఇదే! 
బెంగళూరులో ప్రేయసిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు.. కారణం ఇదే!

Bengaluru: బెంగళూరులో ప్రేయసిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు.. కారణం ఇదే! 

వ్రాసిన వారు Stalin
Aug 28, 2023
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో 24ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటనలో నిందితుడు వైష్ణవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత రెండేళ్లుగా బెంగళూరులోని మైకో లేఅవుట్‌లో దేవా(24), వైష్ణవ్ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. దేవా కేరళలోని తిరువనంతపురానికి చెందిన యువతి కాగా, వైష్ణవ్ కేరళలోని కొల్లంకు చెందినవాడు. ఇద్దరు కాలేజీ నుంచి ప్రేమికులు. ప్రస్తుతం ఇద్దరు బెంగళూరులో సేల్స్, మార్కెటింగ్ రంగంలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇటీవల తరుచూ గొడవలు జరుతుండేవని చుట్టుపక్కల వారు తెలిపారు.

హత్య

దేవాపై అనుమానంతోనే హత్య

దక్షిణ బెంగళూరు సీనియర్ పోలీసు అధికారి సీకే బాబా మాట్లాడుతూ.. దేవాపై అనుమానంతోనే వైష్ణవ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు. ఇద్దరి మధ్య మనస్పర్థలను తొలగించేందుకు శనివారం దేవా సోదరి ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. అయితే ఆదివారం మళ్లీ ఇద్దరి మధ్య గొడవ తలెత్తినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగి దేవాను వైష్ణవ్ కుక్కర్‌తో కొట్టి చంపినట్లు సీకే బాబా చెప్పారు. దేవా చనిపోయే వరకు ప్రెషర్ కుక్కర్‌తో వైష్ణవ్ కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని బాబా వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత పరారీలో ఉన్న వైష్ణవ్‌ను పోలీసులు అరెస్టు చేసారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోందని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.