
Bengaluru: బెంగళూరులో నీటి ధరల పెంపు.. నేటి నుంచే పెరిగిన నీటి ధరలు అమలు..
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో తాగునీటి ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది.
లీటరుకు సుమారు 7 నుంచి 8 పైసల మేరకు పన్ను పెంచనున్నట్టు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) ప్రకటించింది.
చాలా కాలంగా బెంగళూరు నగరం జనాభాలో,భౌగోళిక విస్తృతిలో వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.
ఈ వేగవంతమైన విస్తరణతోపాటు నగరవాసులకు నీటిని సరఫరా చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనాలంటే అవసరమైన నిధుల కొరత కనిపిస్తోందని BWSSB చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ స్పష్టం చేశారు.
వివరాలు
బోర్డుకు నెలకు రూ.80 కోట్ల నష్టం
2014 నుంచి ఇప్పటివరకు నగరంలో నీటి ధరల్లో ఎలాంటి పెంపు చేయలేదని ఆయన తెలిపారు.
కానీ, ప్రస్తుతం బోర్డు భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోందని, అందువల్లే ధరల పెంపు తప్పనిసరిగా మారిందన్నారు.
గత పదేళ్ల కాలంలో విద్యుత్ ఖర్చులు 107 శాతం పెరిగాయి, నిర్వహణ వ్యయాలు 122.5 శాతం పెరిగాయని వివరించారు.
ప్రతి నెలకు సుమారు రూ.200 కోట్లు ఖర్చవుతున్నప్పటికీ, ఆదాయంగా బోర్డుకు కేవలం రూ.120 కోట్లమాత్రమే వస్తుండటంతో, నెలకు రూ.80 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోందని చైర్మన్ తెలిపారు.
ఈ లోటును తగ్గించేందుకే నీటి ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
వివరాలు
పెంపు వివరాలు..
ఇకపై ప్రతి ఏప్రిల్ 1న 3 శాతం చొప్పున నీటి ధరలు పెరిగేలా కర్ణాటక పరిపాలనా సంస్కరణల కమిషన్ సిఫార్సులను అమలు చేయనున్నట్టు కూడా ఆయన చెప్పారు.
ఇప్పటివరకు నిర్ణయించిన పెంపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ప్రతి లీటరుకు ₹0.15 పైసల పెంపు
నెలకు 8,000 లీటర్ల వరకు: లీటరుకు ₹0.30 పైసలు
25,001 నుండి 50,000 లీటర్ల వరకు: లీటరుకు ₹0.80 పైసలు
50,001 లీటర్లకు మించితే: లీటరుకు ₹1
2,00,000 లీటర్ల వరకు ఉన్న అపార్ట్‌మెంట్‌లకు: లీటరుకు ₹0.30 పైసలు
2,00,001 నుండి 5,00,000 లీటర్ల వరకు: లీటరుకు ₹0.60 పైసలు
5,00,001 లీటర్లకు మించి వినియోగిస్తే: లీటరుకు ₹1 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు.