Page Loader
Bengaluru: నా భర్త పెంపుడు పిల్లిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు.. గృహహింస కేసు పెట్టిన భార్య..
నా భర్త పెంపుడు పిల్లిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు.. గృహహింస కేసు పెట్టిన భార్య..

Bengaluru: నా భర్త పెంపుడు పిల్లిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు.. గృహహింస కేసు పెట్టిన భార్య..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 13, 2024
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక హైకోర్టులో దంపతులకు సంబంధించి ఓ విచిత్రమైన కేసు విచారణకు వచ్చింది. ''నా భర్త తన కన్న పెంపుడు పిల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు'' అని భార్య కోర్టులో కేసు పెట్టింది. ఈ వివాదం మొదట్లో సాధారణ వైవాహిక సమస్యగా ప్రారంభమైంది, అయితే అది కోర్టుకు చేరింది. భార్య తన భర్త పిల్లికి ఎక్కువ ప్రేమ, శ్రద్ధ ఇవ్వడం, అలాగే పిల్లి తనపై దాడి చేయడం, దానితో ఆమెకు గాయాలు కావడం వంటి విషయాలు కోర్టులో పేర్కొంది. ఈ కేసులో, క్రూరత్వం,వరకట్న డిమాండ్లకు సంబంధించిన సెక్షన్ 498A కింద చట్టపరమైన కేసు నమోదైంది. కానీ,కోర్టు ఈ వ్యవహారాన్ని వరకట్న డిమాండ్, గృహహింస వంటి సమస్యలతో సంబంధం లేని సాధారణ గృహ వివాదంగా అభివర్ణించింది.

వివరాలు 

IPC 498A కింద అభియోగం

జస్టిస్ ఎం నాగప్రసన్న ఈ కేసును విచారించారు. ఆయన నిర్ణయ ప్రకారం, పిల్లి భార్యపై చాలా సార్లు దాడి చేయడం, గాయపరచడం వంటి సంఘటనలు గొడవలకు కారణమయ్యాయని, కానీ IPC 498A కింద అభియోగం మోపడానికి అవసరమైన చట్టపరమైన ప్రమాణాలు సరిపోలడం లేదని చెప్పారు. అదే విధంగా,జస్టిస్ నాగప్రసన్న మాట్లాడుతూ,ఇలాంటి కేసులు తరచుగా చిన్నపాటి కుటుంబ వివాదాల నుంచి ఉత్పన్నమవుతాయని,వనరులను తప్పుడు కేసులకు ఉపయోగించడం ద్వారా నేర న్యాయ వ్యవస్థను ఇబ్బంది పెట్టడమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల,బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం కూడా IPC 498A సెక్షన్‌తో సంబంధించి ఉంది. తప్పుడు కేసు నమోదు చేయడం, ఆవేదనతో అతను ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం.