Page Loader
Betting Gang : ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు
ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు

Betting Gang : ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు. ఫేక్ కంపెనీల పేరిట బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న భార్యభర్తలైన మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్యను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దంపతులు మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అజయ్, సంధ్య బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా, మొత్తం రూ. 40 లక్షల విలువైన క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు నిందితుల నుంచి రూ. 55,000 నగదు, బ్యాంక్ ఖాతాల్లో రూ. 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Details

గతంలోనూ పట్టుబడ్డ నిందితులు

అంతేకాకుండా మొత్తం 7 అకౌంట్లను గుర్తించారు. పోలీసుల విచారణలో అజయ్ గతంలోనూ నాలుగు సార్లు క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో పట్టుబడినట్లు వెల్లడైంది. అయినా అతడు మరోసారి బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ ముఠాతో సంబంధమున్న ముగ్గురు ఫంటర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, మియాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ మాఫియా భారీగా విస్తరించిందని స్పష్టమవుతోంది. అధికారులు అలాంటి అక్రమ కార్యకలాపాలపై మరింత నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.