Page Loader
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే ?
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చిన కేంద్రం

భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే ?

వ్రాసిన వారు Stalin
Dec 23, 2022
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. బూస్టర్ డోస్‌గా నాసల్ వ్యాక్సిన్‌కు వేసుకోవచ్చని సూచించారు. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్.. అన్ని ప్రైవేట్ కేంద్రాల్లో లభించనుంది. శుక్రవారం సాయంత్రం నుంచి నాసల్ వ్యాక్సిన్‌ను 'కోవిన్' పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నారు. భారత్‌లో బూస్టర్ డోసును మరింత సలభతరం చేసేందుకు వీలుగా.. కొవాగ్జిన్ తయారీదారు అయిన భారత్ బయోటెక్.. ఈ నాసల్ వ్యాక్సిన్‌ను రూపొందించింది.

టీకా

18ఏళ్ల పై బడిన వారికి..

భారత్ బయోటెక్ రూపొందించిన నాసల్ వ్యాక్సినే.. ఇండియాలో మొదటి సూది రహిత బూస్టర్ డోస్ టీకాగా గుర్తింపు పొందింది. 18ఏళ్ల పై బడిన వారు ఈ టీకాను తీసుకోవచ్చు. వ్యాక్సిన్‌ ధరను త్వరలో నిర్ణయించి.. ప్రభుత్వ, ప్రైవేట్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. నాసికా వ్యాక్సిన్​లు ప్రస్తుతం చాలా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నాజల్​ వ్యాక్సిన్​ను ముక్కుద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీకా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే రోగనిరోధక ప్రతిస్పందనలు కలిగిస్తుంది. తద్వారా వైరస్‌ బారినపడకుండా కాపాడుతుంది.