LOADING...
Dhar Bhojshala Row : భోజ్‌శాల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు.. సరస్వతి ఆలయంగా గుర్తింపు
భోజ్‌శాల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు.. సరస్వతి ఆలయంగా గుర్తింపు

Dhar Bhojshala Row : భోజ్‌శాల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు.. సరస్వతి ఆలయంగా గుర్తింపు

వ్రాసిన వారు Moogati Shabari
May 15, 2026
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భోజ్‌శాల/కమల్ మౌలా స్థల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇండోర్‌లోని ద్విసభ్య ధర్మాసనం ఈ వివాదాస్పద ప్రదేశం ఆలయానికి సంబంధించినదేనని పేర్కొంటూ హిందూ పిటిషనర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ స్థలాన్ని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఆధీనంలో ఉంచాలని ఆదేశించింది. ఆలయంలో సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని కూడా సూచించింది. ఈ ప్రదేశంలో చాలా కాలంగా హిందూ ఆరాధనలు కొనసాగుతున్నట్లు ఏఎస్‌ఐ నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ధర్మాసనం తెలిపింది.

వివరాలు

వెలుగులోకి అనేక చారిత్రక ఆధారాలు..

పర్మార్ వంశానికి చెందిన రాజా భోజ్ కాలంలో ఇది సంస్కృత విద్యాకేంద్రంగా ఉన్నట్టు అనేక చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయని కోర్టు పేర్కొంది. ముస్లిం వర్గాలు మసీదు కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. తీర్పు అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆలయ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భోజ్‌శాల స్థల వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అక్కడ ఉన్న మధ్యయుగ కాలానికి చెందిన కట్టడాన్ని హిందువులు వాగ్దేవి సరస్వతి ఆలయంగా భావిస్తుండగా, ముస్లింలు దానిని కమల్ మౌలా మసీదుగా గుర్తిస్తున్నారు.

వివరాలు

తుది తీర్పులో కీలక విషయాలు వెల్లడి..

2003లో ఏఎస్‌ఐ కుదుర్చిన ఒప్పందం ప్రకారం హిందువులు మంగళవారాల్లో, ముస్లింలు శుక్రవారాల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ప్రదేశంలో పూర్తి ఆరాధన హక్కులు తమకే ఉండాలని కోరుతూ హిందూ వర్గాలు ఆ ఒప్పందాన్ని హైకోర్టులో సవాలు చేశాయి. మరోవైపు, ఆ స్థలం మసీదుకు సంబంధించినదేనని ముస్లిం వర్గాలు వాదించాయి. ఈ వివాదంపై స్పష్టత కోసం 2024లో ఏఎస్‌ఐ 98 రోజుల పాటు విస్తృత సర్వే నిర్వహించింది. అనంతరం 2024 జూలై 15న తన నివేదికను కోర్టుకు సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇందౌర్ బెంచ్ ఈరోజు విచారణ జరిపి తుది తీర్పును వెల్లడించింది.

Advertisement