Bhopal: స్కూల్ విలీన నిర్ణయంపై భోపాల్‌లో రోడ్డెక్కిన జెన్ ఆల్ఫా విద్యార్థులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల దేశవ్యాప్తంగా జెన్-జీ ఉద్యమం ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ ఉద్యమం ముగిసింది. ఆ నిరసన ద్వారా జెన్-జీ యువత తమ శక్తిని దేశానికి చాటిచెప్పింది. ఇప్పుడు వారి తర్వాతి తరం అయిన జెన్ ఆల్ఫా కూడా ఉద్యమ బాట పట్టింది. తమ పాఠశాలను విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ భోపాల్‌లో విద్యార్థులు రోడ్డెక్కారు. భోపాల్‌లోని రీజినల్ స్కూల్ విద్యార్థులు బుధవారం నిరసనకు దిగారు. డెమాన్‌స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్స్ (DMS)ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS)లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.
వివరాలు
DMS స్కూల్స్ అంటే ఏమిటి?
పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు. విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తమ విద్యాసంస్థకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, విద్యా ప్రయోగాల ప్రధాన లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
డెమాన్‌స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్స్‌ను రీజినల్ స్కూల్స్‌గా కూడా పిలుస్తారు.
ఇవి 1965 డిసెంబర్ నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
భోపాల్,అజ్మీర్, మైసూరు, భువనేశ్వర్ నగరాల్లో ఈ ప్రయోగాత్మక పాఠశాలలను ఏర్పాటు చేశారు.
విద్యారంగంలో కొత్త బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడం, వినూత్న విధానాలను అమలు చేసి వాటి ఫలితాలను పరిశీలించడం ఈ సంస్థల ప్రధాన ఉద్దేశం.
వివరాలు
DMS స్కూల్స్ అంటే ఏమిటి?
DMS పాఠశాలలను KVSలో విలీనం చేస్తే వాటి ప్రత్యేక విద్యా విధానం, ప్రయోగాత్మక స్వభావం దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థులు, పాఠశాలతో సంబంధం ఉన్నవారు చెబుతున్నారు.
పరిపాలనా వ్యవస్థ మారడంతో విద్యా ప్రయోగాలు, పరిశోధనలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
నిరసన అనంతరం విద్యార్థులు తమ అభ్యంతరాలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రీజినల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.కే. గుప్తాకు అందజేశారు.
రీజినల్ స్కూల్‌ను KVSలో విలీనం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
వివరాలు
DMS స్కూల్స్ అంటే ఏమిటి?
తమ డిమాండ్లపై అధికారులు త్వరగా స్పందించకపోతే ఆందోళనను దశలవారీగా మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని, తమ సమస్యను సంబంధిత అధికారులు, శాఖల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ప్రయోగాత్మక విద్యా కేంద్రాలుగా కొనసాగుతున్న ఈ సంస్థలను మరింత బలోపేతం చేయాలని, వాటి ఏర్పాటుకు ఉన్న అసలు లక్ష్యాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
భోపాల్‌లో ప్రారంభమైన ఈ ఆందోళన.. రీజినల్ స్కూల్స్‌ను KVSలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై విద్యార్థుల నుంచి వ్యక్తమైన తొలి బహిరంగ వ్యతిరేకతగా నిలిచింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
KVSలో విలీనం వద్దు.. రీజినల్ స్కూల్ ఎదుట విద్యార్థుల ఆందోళన
भोपाल में ‘Gen Alpha Protest’! Regional School को केंद्रीय विद्यालय में मर्ज करने के प्रस्ताव के खिलाफ 300 से ज्यादा छात्र सड़क पर उतरे, बोले—“Save DMS” #GenAlpha #Bhopal #KhabarMirror pic.twitter.com/e7F4rH4sWY
— Khabar Mirror (@KhabarMirror) August 19, 2026