Nara Lokesh: 2019లో ప్రాజెక్టులు నిలిపేసిన ఓ కంపెనీ ఏపీకి తిరిగొస్తోంది: నారా లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడం దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, మరో కీలక ప్రకటనకు సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో గణనీయమైన చర్చకు దారితీసింది. ఐదేళ్ల క్రితం రాష్ట్రాన్ని విడిచిపోయిన ఒక ప్రముఖ సంస్థ, మళ్లీ తిరిగి రావడానికి సిద్ధమవుతోందని ఆయన వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నారా లోకేశ్ చేసిన ట్వీట్
A company that stopped new projects in 2019, is coming back to AP like a storm tomorrow. Who is it?? 😊😎Big unveil at 9 AM! Stay tuned!!#InvestInAP #ChooseSpeedChooseAP pic.twitter.com/bM9hrlfPjp
— Lokesh Nara (@naralokesh) November 12, 2025
వివరాలు
#InvestInAP హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయడంతో పెరిగిన ఆసక్తి
"2019లో తమ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక సంస్థ, రేపు తుపానులా ఆంధ్రప్రదేశ్‌లోకి మళ్లీ అడుగుపెడుతోంది. పూర్తి వివరాలు రేపు ఉదయం 9 గంటలకు వెల్లడిస్తాను!!" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. 'బిగ్ ఆన్ వీల్' అనే శీర్షికతో చేసిన ఈ పోస్ట్‌కు ఆయన #InvestInAP, #ChooseSpeedChooseAP అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమల కేంద్రంగా, పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 2019లో ప్రభుత్వం మారిన తరువాత, పలు సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేయడం లేదా ఇతర రాష్ట్రాలకు మారడం జరిగినట్లు విమర్శలు ఉన్నాయి.
వివరాలు
ఆ కంపెనీ ఏదనే దానిపై సర్వత్రా ఉత్కంఠ
ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడం, కొత్త పెట్టుబడులను ఆహ్వానించడం వంటి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో లోకేశ్ సూచించిన ఆ కంపెనీ ఏది? ఎంత పెద్ద పెట్టుబడిని పెట్టబోతోంది? అనే ప్రశ్నలపై ఆసక్తి పెరిగింది. ఈ రహస్యం వెల్లడి కావాలంటే రేపు (గురువారం) ఉదయం 9 గంటల వరకు నిరీక్షించాల్సిందే.