Page Loader
Tummala: BRSకు బిగ్‌ షాక్ .. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా
BRSకు బిగ్‌ షాక్ .. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా

Tummala: BRSకు బిగ్‌ షాక్ .. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2023
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్ఎస్‌లో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నేడు సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మలతో పాటు బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలు కాంగ్రెస్ చేరనున్నట్లు సమచారం. తుమ్మల 1985, 1994, 1999, 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్‌లో చేరి, మంత్రి కూడా బాధ్యతలను చేపట్టాడు.

Details

ఖమ్మం నుంచి తుమ్మల పోటీ?

తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్ కోసం ఇప్పటికే పొంగులేటి దరఖాస్తు చేశారు. తుమ్మలకి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో తుమ్మల శనివారం కాంగ్రెస్ చేరుతారని తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు.