Loading...
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు బిగ్‌ షాక్‌.. 2006 నాటి కేసుపై విజిలెన్స్‌ విచారణ!
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు బిగ్‌ షాక్‌.. 2006 నాటి కేసుపై విజిలెన్స్‌ విచారణ!

Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు బిగ్‌ షాక్‌.. 2006 నాటి కేసుపై విజిలెన్స్‌ విచారణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల నిర్వహణపై వివాదాలు కొనసాగుతున్న వేళ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎస్‌ఐఆర్‌తో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు కీలక వ్యవహారాల్లో ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో.. సుమారు రెండు దశాబ్దాల క్రితం, అంటే 2006లో ఆయనపై నమోదైన ఓ ఆత్మహత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నాటి కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి కేసులోని అంశాలపై విజిలెన్స్‌ విచారణకు కేరళ హోం మంత్రి రమేష్‌ చెన్నితాలా ఆదేశాలు జారీ చేసినట్లు కథనంలో పేర్కొన్నారు.

వివరాలు

అసలేం జరిగింది?

2006లో కేరళ రాష్ట్ర రవాణా ప్రాజెక్టులో భాగంగా ఎంసీ రోడ్డు ఆధునీకరణ పనులకు కాంట్రాక్ట్‌ కుదిరింది.

మలేషియాకు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ 'పాటి', కేరళకు చెందిన భాగీరథి కన్‌స్ట్రక్షన్స్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా 'పాటి-బెల్‌' పేరుతో ఈ పనులను చేపట్టాయి.

అదే సమయంలో కేరళ కేఎస్‌పీటీ-1 ప్రాజెక్ట్‌కు చీఫ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న మలేషియాకు చెందిన సివిల్‌ ఇంజనీర్‌ లీసీ బీన్‌ ఆత్మహత్య చేసుకున్నారు.

ఆ సమయంలో జ్ఞానేశ్‌ కుమార్‌ కేరళ పీడబ్ల్యూడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

వివరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు

ఆత్మహత్యకు ముందు లీసీ బీన్‌ రాసినట్లు చెబుతున్న సూసైడ్‌ నోట్‌లో జ్ఞానేశ్‌ కుమార్‌ పేరును ప్రస్తావించినట్లు ఆరోపణలున్నాయి.

ప్రాజెక్టు పనుల నిర్వహణలో తీవ్రమైన అవినీతి, తప్పుడు నిర్వహణ జరిగిందని, అలాగే పీడబ్ల్యూడీ అధికారుల నుంచి తీవ్ర వేధింపులు ఎదురయ్యాయని ఆ నోట్‌లో పేర్కొన్నట్లు కథనంలో ఆరోపించారు.

ఈ వేధింపుల వెనుక అప్పటి పీడబ్ల్యూడీ కార్యదర్శిగా ఉన్న జ్ఞానేశ్‌ కుమార్‌ పాత్ర ఉందనేది ప్రధాన ఆరోపణగా ఉంది. నాటి ఈ ఘటన కేరళలో అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

ADVERTISEMENT

వివరాలు

ప్రాథమిక విచారణ తర్వాత ఏం జరిగింది?

ఈ ఘటనపై అప్పట్లో ప్రాథమిక విచారణ జరిగినప్పటికీ.. తదుపరి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసు దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగులోకి రాలేదనే బలమైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో.. నాటి సూసైడ్‌ నోట్‌లో చేసిన ఆరోపణలు, అప్పటి ప్రాథమిక దర్యాప్తులో చోటుచేసుకున్న లోపాలు, అలాగే దర్యాప్తుపై ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపితేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని కేరళ ప్రభుత్వం భావించినట్లు కథనంలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు దశాబ్దాల నాటి కేసుపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది..

ADVERTISEMENT