
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్.. ఈ నెల 20 వరకు రిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. విజయవాడలోని సీఎంఎం కోర్టు ఆయనకు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
ఈ రోజు ఆయనను పోలీసుల ఆధ్వర్యంలో సీఎంఎం కోర్టులో హాజరు పరిచారు. అయితే తనపై అక్రమంగా కేసులు బనాయించారని న్యాయాధికారికి పోసాని వివరించారు.
తనను ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కోర్టుకు తెలియజేసిన పోసాని, గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయన్నారు.
తన ఆరోగ్య పరిస్థితిపై న్యాయమూర్తికి వివరించడంతో పాటు, గతంలో జరిగిన ఆపరేషన్ గురించి కోర్టు హాల్లో చూపించారు. ఆయన చెబుతున్న ప్రతీ విషయాన్ని న్యాయమూర్తి క్షుణ్ణంగా విన్నారు.
Details
పోసానిపై జనసేన ఫిర్యాదు
ఈ కేసులో భాగంగా, పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరు పరిచారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యులను దూషించడం, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ జనసేన పార్టీకి చెందిన శంకర్ ఫిర్యాదు చేయడంతో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భాగంగానే పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా నుంచి విజయవాడకు ఆయన్ను తీసుకొచ్చినట్లు తెలిసింది.
చివరగా, పోసాని కృష్ణ మురళికి ఈ నెల 20వ తేదీ వరకు సీఎంఎం కోర్టు. రిమాండ్ విధించింది.